Thursday, September 18, 2025

జమ్ము కశ్మీర్ లో రెండు బస్సుల్లో బాంబు పేలుళ్లు

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఉధయ్ పూర్ జిల్లాలో బుధవారం రాత్రి పది గంటల సమయంలో పార్క్ చేసిన బస్సులో బాంబు పేలుళ్లు జరగాయి. ఉధమ్‌పూర్ జిల్లాలో పార్క్ చేసిన బస్సులో బాంబు పేలడంతో ఇద్దరు గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దోమాలీ చౌక్ ప్రాంతంలో పార్క్ చేసిన బస్సులో బాంబు పేలుడు చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆప్రాంతంలో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణికులు ఉన్నప్పుడు బాంబు పేలి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News