Tuesday, September 2, 2025

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

- Advertisement -
- Advertisement -

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను ఎత్తివేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. సోమవారం శాసన మండలిలో మాట్లాడిన ఆయన ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లోని మరింత మందికి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. బీసీల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే బీఆర్‌ఎస్ అడ్డుతగలడం సరికాదన్నారు. 70 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ సభ కనీసం తమ బాధ వినాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News