బారాబంకి: ఆదివారం హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలోని ఓ ఆలయంలో (Barabanki Temple) విషాదం చోటు చేసుకుంది. బారాబంకిలోని ఆవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో విద్యుత్ తీగలు తెగడంతో ఒక్కసారిగా ఆలయంలో ఉన్న భక్తులందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ దుర్ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోతులు విద్యుత్ తీగలపై దూకడం వల్లే అవి తెగిపోయాయని. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. అవ్సేశ్వర్ మహాదేవ్ ఆలయంలో (Barabanki Temple) భక్తుల శివుడిని ‘జలాభిషేకం’ చేసేందుకు భక్తులు తరలివచ్చారు. అభిషేక్ం కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అక్కడి ప్రజలు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. కానీ, అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘటనపై యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలను ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు.