- Advertisement -
చురచంద్‌పూర్ (మణిపూర్): మణిపూర్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. చురచంద్‌పూర్‌లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ (NCS) తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 1.54 గంటలకు భూకంపం సంభవించినట్లు చెప్పింది. 40 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 40 కిలీమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడిందని పేర్కొంది
అలాగే, మణిపూర్‌లోని నోనీలో రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సీస్మోలజీ తెలిపింది. ఈ ఘటనల్లో ప్రాణ, ఆస్థి నష్టంకు సంబంధించిన వివరాలు ఇంకా అందలేదని అధికారులు తెలిపారు.
- Advertisement -