Thursday, September 4, 2025

ఎసిబికి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఉద్యోగులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సీనియర్ అసిస్టెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కర్ణ శ్రీనివాస్‌రావు రూ.7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబికి పట్టుబడ్డాడు. బుధవారం నిజామాబాద్ ఎసిబి అధికారులు నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. విఎల్ టి ఫైల్‌ను ప్రాసెస్ చేయడంలో జాగ్రత్త వహించడం, విఎల్ టి నంబర్ కేటాయింపు, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా బాధితుడి దుకాణం సజావుగా పనిచేసేలా చూసుకోవడం‘ కోసం రూ. 10,000 డిమాండ్ చేశాడు.

దీంతో బాధితుడితో రూ.7,000కు తగ్గించి బేరం కుదిరింది. బాధితుడు చేసేదేమీ లేక నేరుగా ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి వద్ద నుండి రూ.7,000 లంచం మొత్తాన్ని తీసుకునే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. కాగా, ఎసిబి పట్టుబడిన సదరు ఆర్‌ఐ కర్ణ శ్రీనివాసరావు గతంలో బోధన్ మున్సిపాలిటీలో విధులు నిర్వహించేవాడు. అక్కడ సైతం ఎసిబికి పట్టుబడినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసి, హైదరాబాద్ నాంపల్లిలోని అదనపు ఎసిబి ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మరో సంఘటనలో మంచిర్యాల జిల్లా, హాజిపూర్ మండలం, కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకటస్వామి రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక అధికారులకు చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి..

కర్ణమామిడి గ్రామానికి చెందిన డోల్క నాగమణి ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇల్ల్లు బేస్మెంట్ స్థాయికి చేరుకోవడంతో మొదటి విడత బిల్లును ఆమోదించేందుకు పనుల ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరింది. ఇందుకు పంచాయతీ కార్యదర్శి రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా చివరికి నాగమణి రూ.20 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఈ విషయాన్ని ఎసిబి అధికారులకు తెలిపింది. వారి సూచనల మేరకు బుధవారం నాగమణి పంచాయతీ కార్యదర్శిని తన ఇంటికి పిలిచి రూ.20 వేలు ఇస్తుండగా కరీంనగర్ ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తన సిబ్బందితో కలిసి గ్రామ కార్యదర్శిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపి అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News