- Advertisement -
కామారెడ్డి జిల్లా, పిట్లం మండలం, కంబాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఎర్ర హన్మయ్య (55), గైని రాములు (39) అనే రైతులు మంగళవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుత్ మోటార్ కాలిపోవడంతో మోటార్ నీటి పైప్‌లైన్‌లను సరిచేస్తున్నారు.
ఇందులో భాగంగా విద్యుత్ మోటార్ నుంచి వెళుతున్న పైప్‌లైన్‌కు ఒక్కసారిగా కరెంట్ ప్రవహించడంతో ఇనుప పైపునకు విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందగా, ఇదే ప్రమాదంలో మెకానిక్ సాయిలుకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలం వద్ద మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
- Advertisement -