Wednesday, May 7, 2025

ఎసిబి వలలో ఇద్దరు జడ్‌పి కార్యాలయ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

జిల్లా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య ఎసిబి దాడిలో పట్టుబడ్డారు. తోటి ఉద్యోగి మెడికల్ లీవ్ సెటిల్ మెంట్ బిల్ కోసం వారు రూ.60 వేలు లంచంగా డిమాండ్ చేశారు. అందులో భాగంగా బాధితుడి నుంచి ముందస్తుగా కార్యాలయ సూపరింటెండెంట్ రూ.25 వేలు లంచంగా తీసుకుంటుండగా మంగళవారం ఎసిబి అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ 2023=24 సంవత్సరంలో పలుమార్లు అనారోగ్యం కారణంగా విధులకు రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు. 2025 జనవరి నుండి నిత్యం విధులకు హాజరవుతున్నాడు. అతని మెడికల్ లీవ్ పీరియడ్‌కు సంబంధించి లీవ్ సెటిల్‌మెంట్ చేసి ట్రెజరీకి పంపించడం కోసం సూపరింటెండెంట్ సుధాకర్, సంబంధిత సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్య లంచంగా రూ.60 వేలు డిమాండ్ చేశారు.

ఇందులో రూ.40 వేలు బిల్లు వచ్చిన తదుపరి ఇవ్వాలని, ముందుగా తనకు రూ.20 వేలు ఇవాలని సుధాకర్, రూ.5 వేలు తనకు ఇవ్వాలని సౌమ్య డిమాండ్ చేశారు. అయితే, వారు అడిగిన డబ్బులు ఇవ్వడం ఇష్టంలేక బాధితుడు హన్మకొండ ఎసిబి కార్యాలయాన్ని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో తోటి ఉద్యోగి సూపరింటెండెంట్ కు రూ. 20 వేలు, సౌమ్యకు రూ. 5 వేలు ఇచ్చే క్రమంలో సౌమ్యకి ఇచ్చే డబ్బులు కూడా సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని సూచించారు. దీంతో రూ.25 వేలు సూపరింటెండెంట్‌కు ఇస్తుండగా వారిని రెడ్‌హ్యాండెండ్‌గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం ఉదయం వరంగల్ ఎసిబి కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్‌పి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఎసిబి కార్యాలయాన్ని సంప్రదించాలని గానీ, ఫోన్ నెంబర్ 9440446106 ద్వారాగానీ, కార్యాలయ టోల్ ఫ్రీ నెంబర్ 1064ను గానీ సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News