Thursday, May 1, 2025

అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థి వీసాపై అమెరికాకు వచ్చిన ఇద్దరు భారతీయ యువకులు వృద్ధులను లక్షంగా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నిందితులను భారత్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మదిల్హామ్ వహోరా, హజియాలి వహారాలుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. వారు చికాగో లోని ఈస్ట్‌వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు తెలిపారు.

తనకు స్కామర్ల నుంచి ఫోన్ వచ్చిందని ఓ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడని అధికారులు పేర్కొన్నారు. స్కామర్లు తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఓ కేసు విషయంలో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో క్రిప్టోకరెన్సీ ఎటిఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికి ఇచ్చారని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితులను అదుపు లోకి తీసుకున్నారు. గతం లోనూ వీరు ఇదే విధంగా పలువురు వృద్ధులను మోసం చేసినట్టు గుర్తించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News