Tuesday, May 13, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడగా చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ విషాదం వ్యక్తం చేసింది.
ఇద్దరు భారతీయ విద్యార్థులు మానవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్ మృతి పట్ల న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

“క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మానవ్ పటేల్(20), సౌరవ్ ప్రభాకర్ (23) ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.ఈ క్లిష్ట సమయంలో వారికి మద్దతుగా ఉంటామని. సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తాం” అని భారత కాన్సులేట్ తెలిపింది.

కాగా, గత శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో బ్రెక్‌నాక్ టౌన్‌షిప్‌లోని పెన్సిల్వేనియా టర్న్‌పైక్‌లో  ఈ ప్రమాదం జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసుల ప్రకారం.. ప్రభాకర్ నడుపుతున్న వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి.. ఆపై వంతెనను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు భారతీయ విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News