అమెరికా రాజధాని వాషింగ్టన్‌లె ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందికి చెందిన ఇద్దరి హత్య జరిగింది. ఇక్కడి జూయిష్ మ్యూజియంకకు సమీపంలోనే ఈ కాల్పుల ఘటనలో వారు చనిపోయారు. గాజాలో ఇజ్రాయెల్ సేనల స్వైరవిహారం దశలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్య జరగడం , అదీ అమెరికాలో పరిణామం చోటుచేసుకోవడం కలకలం రేకెత్తించింది. బుధవారం సిబ్బంది వారు ఇద్దరు మ్యూజియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వెళ్లుతున్న దశలోనేవారిపై కాల్పులు జరిగాయి, కాల్పులకు దిగిన వ్యక్తి పాలస్తీనియా అనుకూల నినాదాలకు దిగాడని పోలీసులు తెలిపారు. పాలస్తీనియాకు స్వేచ్ఛ దక్కాలి అని నినదించారు. ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ స్పందించారు.
దాడికి దిగిన వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది, విచారణ చేపట్టారు. ఈ వ్యక్తిని 30 సంవత్సరాల ఎలియస్ రోడ్రిగ్యూగా గుర్తించారు. చికాగో నివాసి అని వెల్లడైంది. కాల్పులకు ముందు ఈ వ్యక్తి మ్యూజియం వెలుపలనే ఉండి , ఇజ్రాయెలీల కోసం కాపు కాసినట్లు వెల్లడైంది. యూధుల హత్య దారుణ విషయం అని, ఇక ఇటువంటి హత్యకాండ ఆగిపోవాలని అమెరికా అధ్యక్షుటు ట్రంప్ సందేశం వెలువరించారు. వాషింగ్టన్‌లోనే ఈ కాల్పుల ఘటన జరగడం, మిత్ర అత్యంత సన్నిహిత దేశం ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది బలి కావడం అమెరికా ఉన్నతాధికారుల్లో కలవరానికి దారితీసింది.