Thursday, August 21, 2025

సిపి ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సిపి ఎదుట ఇద్దరు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు సిపి ఎదుట లొంగిపోయారు. కాకరాల సునీతతో పాటు మరో మావోయిస్టు తమ ఎదుట లొంగిపోయారని సిపి సుధీర్ బాబు తెలిపారు. ఆమె తండ్రి కాకర్ల సత్యనారాయణ, ఒక విప్లవ రచయితల సంఘం నాయకుడిగా పని చేసినట్లు గుర్తించామన్నారు. వరవరరావు, గద్దల్ లాంటి విప్లవకారులు వారి ఇంటికి రావడంతో సునీత పీపుల్స్ వార్ వైపు మొగ్గు చూపారని తెలియజేశారు. 1986లో పీపుల్స్ వార్ పార్టీలో కాకరాల సునీత చేరారని వివరించారు. 1986 ఆగస్టులో ఆమెను టిఎల్‌ఎన్ చలం గౌతమ్ అలియాస్ సుధాకర్‌ను పెళ్లి చేసుకున్నాడని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెంట్రల్ ఆర్గనైజర్‌గా పని చేశారని, 1992లో నల్లమల అడవుల్లోకి వెళ్లి అనంతరం 2001లో ఎఒబి నుంచి 2006 దండకారణ్యానికి సునీత బదిలీ అయ్యారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో సునీతది కీలక పాత్ర పోషించారని, మావోయిస్టు పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్‌గా పని చేశారని, శాంతి చర్చల ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించారని, ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్‌కౌంటర్లలో పాలుపంచుకున్నారని సిపి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News