Monday, May 12, 2025

విద్యుత్ షాక్ తో ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

విద్యుత్ షాక్‌తో ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన ఇది. వ్యవసాయ పొలంలో కరెంట్ స్తంభాలు పాతుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని కావేరమ్మ పేటలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. కావేరమ్మపేటకు చెందిన రైతు ఆంజనేయులు తన వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం కింద పడడంతో రైతు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ స్తంభా ల మరమ్మతు కోసం ప్రైవేట్ కరెంట్ ఉద్యోగి అయిన బండమీద పల్లి గ్రామానికి చెందిన మనీష్ కుమార్ విద్యుత్ స్తంభాలను మరమ్మతులు చేస్తు న్నాడు. అతడికి సహాయం చేద్దామని రైతు ఆంజనేయులు ట్రాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే వీరు సరి చేస్తున్న స్తంభానికి విద్యుత్ సర ఫరా కావడంతో రైతు ఆంజనేయులుతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన మనీష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో అక్క డే ఉన్న ఇరుగు పొరుగు వ్యవసాయ పొలాల రైతులు ట్రాక్టర్‌ను ముట్టుకునే క్రమంలో వారికి అర్థింగ్ రావడంతో వాళ్లు వదిలించుకొని చూసే లోపే ఇద్దరు కింద పడిపోయారని ప్రత్యక్ష సాక్షులైన రైతులు వెల్లడించారు.

కాగా విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసిన గాని మరమ్మతు చేస్తున్న విద్యుత్ స్తంభాలకు విద్యుత్ సరఫరా ఎలా అవుతుందని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే రెండు ప్రాణాలు బలి అయ్యాయని ఇలాంటి పనులు విద్యుత్ శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్ దగ్గరుండి చేయించాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరించడం ద్వారానే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. ఈ విష యం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరా గల కారణాలను ప్రమాదం జరిగిన తీరును పంచనామా నిర్వ హించారు. కాగా ఈ ఘటన జరిగి రెండు గంటలైనా కూడా విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి రాకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలి రావడంతో పాటు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News