కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ లో బుధవారం చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యకులు సయ్యద్ ఫిరోజ్ (52), సయ్యద్ రిజ్వాన్ (20) ప్రమాద వశాత్తు నీటిలో జారిపడి మునిగి మృతి. కరీంనగర్ కు చెందిన సయ్యద్ ఫిరోజ్ (52) తన తమ్ముడి కొడుకు అయిన సయ్యద్ రిజ్వాన్(20) అనే ఇద్దరు వ్యక్తులు ఎల్ఎండి రిజర్వాయర్ లోకి చేపలు పట్టేందుకు వెళ్లగా, చేపలు పడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు రిజ్వాన్ నీళ్లలోకి పడి మునిగిపోవడంతో అతన్ని కాపాడేందుకు ఫిరోజ్ కూడా నీళ్ళలోకి దిగి కాపాడే ప్రయత్నంలో ఇద్దరు మునిగిపోయారు. స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే సంఘటనా స్థలికి సీఐ సదన్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ లు చేరుకొని ఇద్దరి మృతదేహాలను బయటకు తీసిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -