Wednesday, July 2, 2025

రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మరిపెడ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఆర్‌ఐ శరత్ చంద్ర తెలిపారు. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా మరిపెడ మండల బీచ్‌రాజుపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండటంతో ట్రాక్టర్లను పట్టుకొని మరిపెడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఏ నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News