Wednesday, August 20, 2025

యూకేలో ఇద్దరిపై జాత్యహంకార దాడి

- Advertisement -
- Advertisement -

యూకేలో ఇద్దరు వ్యక్తులపై జాత్యహంకార దాడి సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శిరోమణి అకాలీదళ్‌కు నాయకత్వం వహిస్తున్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపిన వివరాల ప్రకారం .. యూకే లోని వోల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 15న ఈ సంఘటన జరిగింది. ఇద్దరు సిక్కు వ్యక్తులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ జాత్యహంకార దాడిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యూకే లోని సిక్కు ప్రవాసుల భద్రత గురించి అధికార ప్రభుత్వం

వద్ద లేవనెత్తాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఆయన కోరారు. బాధితులకు న్యాయం చేయాలని అక్కడి పోలీసులను అభ్యర్థించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపు లోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే ఆ తర్వాత బెయిల్‌పై నిందితులు విడుదలైనట్టు తెలుస్తోంది. యూకె ఎంపీ సురీనా బ్రాకెన్‌రిడ్జ్ కూడా ఈ దాడిని ఖండించారు. సంఘటనకు సంబంధించిన నివేదికలను తనకు అందజేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా వోల్వర్‌హాంప్టన్ లోని ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News