Saturday, May 3, 2025

ఎప్‌సెట్‌ పరీక్ష రాసి వస్తుండగా ప్రమాదం.. అక్కాచెల్లెళ్లు మృతి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎప్‌సెట్‌ పరీక్ష రాసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. పరీక్ష అనంతరం ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్తండగా.. వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కాచెల్లలు అయిన ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టో మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News