- Advertisement -
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అఖల్ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత రాత్రిపూట ఈ దాడి ప్రారంభమైంది. ఇరువర్గాల మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన తొలి కాల్పుల తర్వాత, రాత్రికి ఆపరేషన్ నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ‘కార్డెన్’ను బలోపేతం చేశారు, అదనపు బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. కాల్పులు శనివారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు, గ్రూప్ అనుబంధాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉందని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.
- Advertisement -