Tuesday, May 13, 2025

ఉపాధి పనులకు వెళ్తున్న వారిని ఢీకొన్న కారు..ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, అక్బర్‌పేట-భూంపల్లి మండలం, పోతారెడ్డిపేట గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన కారు బ్యాగరి చంద్రవ్వ, గోప దేవవ్వ అనే ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన తోటి కూలీలు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుమ్ముకున్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ రాష్ట్ర ఛైర్మన్ బక్కి వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ హైవే ఏర్పడినప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అధికారులు వీటిపై చర్యలు తీసుకొని ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు తప్పనిసరిగా న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. అనంతరం డిఆర్‌డిఎ పిడి, ఆర్‌డిఒ పోతారెడ్డిపేట గ్రామానికి చేరుకొని మృతి చెందిన ఉపాధి హామీ కార్మికులకు ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News