Thursday, September 11, 2025

విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు కార్మికుల మృతి

- Advertisement -
- Advertisement -

బోధన్ జిల్లా సాలురా మండలం సిద్దాపూర్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు పైన పడి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ కథనం ప్రకారం… ఇటీవల వరదల కారణంగా బికినీల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కల్దుర్కి శివారులోని నిల్వచేసిన ప్రాంతం నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ లో విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలు పైన పడటంతో బిట్నెల్లి గ్రామపంచాయతీలో పని చేసే బాలాజీ, యాదు అనే ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోని మృతి చెందారు . స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బోధన్ జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.

Also Read: ఎలక్షన్ కమిషన్ నిర్లక్ష్యానికి మమ్మల్ని బాధ్యులను చేస్తారా..!: కోట నీలిమ

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News