Thursday, July 31, 2025

లవర్ మోసం చేసిందని ఒకరు.. తల్లిదండ్రులు మందలించారని మరొకరు

- Advertisement -
- Advertisement -

లవర్ మోసం చేసిందని ఒకరు.. తల్లిదండ్రులు మందలించారని మరొకరు.. ఇద్దరూ యువకులు వేరు వేరు ప్రాంతాలలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఎస్సై హనుమాన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్ గోకులే నగర్ లో నివసిస్తున్న చక్రపాణి ఇనోస్ అలియాస్ తరుణ్ (26) ప్రైవేటు ఉద్యోగి. ఇతడికి పీర్జాదిగూడలో నివసిస్తున్న ఓ యువతి పరిచయమైంది. ఇది కాస్త ప్రేమగా మారింది. 2019 నుండి 2023 సంవత్సరం వరకు ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. మధ్యలో ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయారు. ఈ విషయంలో ఇనోస్ మోసం చేశాడని ఆ యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు విచారణ జరిపి అతడిని కోర్టుకు రిమాండ్ చేశారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఇనోస్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.

8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చివరికి జైలుకు పంపించిందని తీవ్ర మనస్థాపనతో బుధవారం పగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూమ్ లో తల్లికి వాట్సాప్ మెసేజ్ పెట్టి ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి జ్ఞానేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమాన్ నాయక్ తెలిపారు. తన కుమారుడు ఆత్మహత్యకు కారణమైన యువతి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామంతపూర్ రామ్ రెడ్డి నగర్ లో నివసిస్తున్న ఈశ్వర చారి (22) డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా డబ్బులు తీసుకొని బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల గోవా కూడా వెళ్లి వచ్చాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు మందలించినందుకు మనస్థాపానికి గురైన ఈశ్వర చారి ఇంట్లోని హాల్లో ఊయల ఉక్కుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి రవీంద్ర చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హనుమాన్ నాయక్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News