Friday, July 18, 2025

దొంగతనం కేసులో ఇద్దరు యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నల్లబెల్లి: దొంగతనం కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై గోవర్దన్ తెలిపారు. గురువారం నల్లబెల్లిలోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్సై గోవర్దన్ మాట్లాడుతూ.. ఈనెల 14న సోమవారం అర్ధరాత్రి సమయంలో మండల కేంద్రంలోని తిరుమల వైన్స్‌లో చోరీ జరిగినట్లు షాపు యాజమాని ఫిర్యాదు చేసినట్లు తెలిఆపరు. గురువారం నల్లబెల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకొని విచారించినట్లు తెలిపారు.

విచారణలో భాగంగా నల్లబెల్లిలో ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తున్న నల్లబెల్లికి చెందిన బొడిగ ప్రశాంత్, ఎలబోయిన సాయికుమార్ చదువుకుంటున్న యువకుడు చెడు వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో ఇద్దరూ కలిసి ఈనెల 14న అర్ధరాత్రి సమయంలో నల్లబెల్లిలోని తిరుమల వైన్స్ షాపు వెంటిలేటర్‌ను బొడిగ ప్రశాంత్ అనే యువకుడు పగులగొట్టి అందులో నుంచి లోపలికి వెళ్లి క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు దొంగించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే కాపలాగా ఎలబోయిన సాయికుమార్ ఉన్నట్లు ఒప్పుకున్నారన్నారు. ఆ డబ్బులను తీసుకొని ఇద్దరు కలిసి గురువారం వరంగల్‌కు వెళ్తుండగా నల్లబెల్లి క్రాస్ వద్ద వారిని పట్టుకొని పంచుల సమక్షంలో వారి నుంచి రూ. 19,800 స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కాగా వాహనాల తనిఖీలో కానిస్టేబుల్ వేణు, సాయిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News