- Advertisement -
హైదరాబాద్: కాలుకు సర్జరీ చేస్తే గుండెపోటుతో బాలుడు మృతి చెందాడని వైద్యులు చెప్పిన సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని టిఎక్స్ ఆస్పత్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏడేళ్ల బాలుడి కాలుకు దెబ్బతాకడంతో రావడంతో టిఎక్స్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు కాలుకు చీము పట్టిందని ఆపరేషన్ చేయాలని సూచించారు. వైద్యం వికటించి బాబు మృతి చెందడంతో గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు,బంధువులు ఆందోళనకు దిగారు.
- Advertisement -