Sunday, September 14, 2025

భారత వలసదారుల తరలింపు.. స్పందించిన అమెరికా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా స్పందించింది. తమ దేశం , ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకు మించి ఏం చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈమేరకు భారత్ లోని యూఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడారు. భారత్‌కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News