Tuesday, September 2, 2025

యుఎఇ కెప్టెన్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బద్దలు

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్‌కి ముందు పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, యుఎఇ మధ్య ముక్కోణపు టి-20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 1) అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌‌లో యుఎఇ కెప్టెన్ ముహమ్మద్ వసీం (Muhammad Waseem) వీర విధ్వంసం సృష్టించాడు. బౌలర్లపై తనదైన శైలీలో విరుచుకుపడ్డ వసీం ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సులు బాదిన వసీం.. ఒక అంతర్జాతీయ టి-20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీం ఇండియా మాజీ టి-20 కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంతేకాక.. అంతర్జాతీయ టి-20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన కెప్టెన్‌గా కూడా వసీం (Muhammad Waseem).. రోహిత్‌ను అధిగమించాడు. రోహిత్ 62 ఇన్నింగ్స్‌లో 105 సిక్సులు కొట్టగా.. వసీం 54 ఇన్నింగ్స్‌లో 110 సిక్సులు కొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (65 ఇన్నింగ్స్‌ల్లో 86 సిక్సర్లు), ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (76 ఇన్నింగ్స్‌ల్లో 82 సిక్సర్లు) ఉన్నారు.

వసీం ఈ మ్యాచ్‌లో రాణించినప్పటికీ.. తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో వసీం (67), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (52) రాణించినప్పటికీ.. మిగితా వాళ్లు తడబడ్డారు. దీంతో ఈ మ్యాచ్‌లో యుఎఇ 150 పరుగులు మాత్రమే చేసి.. 38 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Also Read : కివీస్ బ్యాటర్ సుడిగాలి సెంచరీ.. చరిత్రలోనే మొదటి క్రికెటర్‌గా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News