Wednesday, April 30, 2025

ఒంటరిగా మిగిలిపోయాం… సాయం చేయండి: జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

Ukraine alone with russia war

 

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో తాము ఒంటిరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని అనుకున్నాము కానీ ఏ దేశం నుంచి సాయం అందలేదన్నారు. ఒకవేళ తమకు మద్దతుగా ఉంటే నాటోలోకి తమను తీసుకోవాలని కోరారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రస్తుతం ఒంటరిగా ఉన్నామని, ఉక్రెయిన్‌తో ఉన్నారా లేదా అనే మిత్ర పక్ష దేశాలను అడుగుతున్నామన్నారు. దేశ భద్రత గురించి తాము మాట్లాడబోమని, దేశ రక్షణ మాటేమిటని ప్రశ్నించారు. సైనిక స్థావరాలపైనే కాకుండా పౌరులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు ఉక్రెయిన్ వదిలి వెళ్లలేదన్నారు. ఎలాంటి స్థితులోనైనా ఉక్రెయిన్ ప్రజలతో ఉంటానని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News