సుస్థిర మైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు చెందిన పదమూడు సున్నపురాయి గనులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందాయి. రాజస్థాన్‌లోని జైపుర్‌లో జూలై 7, 2025న జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఈ గుర్తింపులను ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ గుర్తింపును గెలుచుకున్న గనులలో ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్‌లో భాగమైన తుమ్మలపెంట సున్నపురాయి గని ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న అల్ట్రాటెక్ ఇంటిగ్రే టెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. ఈ యూనిట్ ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ గుర్తింపును గెలుచుకోవడం ఇది వరుసగా మూడవ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ తన మైనింగ్ ప్రాంతంలో నీటి సంరక్షణ, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, కమ్యూనిటీ నిమగ్నత మరియు సమీపంలోని అనేక గ్రామాలను దత్తత తీసుకోవడం వంటి వాటి ద్వారా ఈ యూనిట్ ఇతర వాటి నుండి ప్రత్యేకంగా నిలిచింది.
అల్ట్రాటెక్ పన్నెండు సున్నపురాయి గనులు 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. వీటిలో ఒకటి ‘గ్రీన్ మైనింగ్’ పట్ల అసాధారణ కృషికి 7-స్టార్ రేటింగ్‌ను పొందిన అత్యున్నత ఘనతను పొందింది. దేశంలో సున్నపురాయి మైనింగ్ విభాగంలో 7-స్టార్ రేటింగ్‌ను పొందిన ఏకైక గనిగా ఇది నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, భారతదేశంలో అతిపెద్ద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్ (RMC) కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ను 2023–24 పనితీరు సంవత్సరానికి సుస్థిరమైన అభివృద్ధి మరియు నిర్వహణ దిశగా ఈ గనులు సాధించిన అత్యుత్తమ విజయాలకు గాను సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా హాజరయ్యారు.
మైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభను సాధించడంలో అల్ట్రాటెక్ ప్రయత్నాలు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరమైన, గ్రీన్ మైనింగ్, సమర్థవం తమైన కార్యకలాపాలు, సాంకేతికత ఆధారిత ఖనిజ ప్రాసెసింగ్ వైపు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నివేదికలో వరుసగా రెండవ సంవత్సరం, ఖనిజాల (సున్నపురాయి, ఇనుప ఖనిజం, బాక్సైట్, లెడ్ జింక్, మాంగనీస్) అన్ని వర్గాలలో అత్యధిక సంఖ్యలో గనులకు 5-స్టార్ రేటింగ్‌ను పొందిన ఘనతను అల్ట్రాటెక్ కలిగి ఉంది.
గనుల మంత్రిత్వ శాఖ రూపొందించిన స్టార్ రేటింగ్‌లు మైనింగ్‌లో సుస్థిర అభివృద్ధి చట్రాన్ని సమగ్రంగా, సార్వత్రికంగా అమలు చేయడానికి ఉత్తమ పద్ధతులను అనుసరించడంపై ఆధారపడి ఉంటాయి. రేటింగ్ పథకంలో అత్యధిక స్థాయివైన 7 స్టార్ మరియు 5-స్టార్ రేటింగ్ అనేవి శాస్త్రీయ, సమర్థవంతమైన మైనింగ్, ఆమోదించబడిన ఉత్పత్తి యొక్క అనుగుణ్యత, జీరో వేస్ట్ మైనింగ్, పర్యావరణ పరిరక్షణ, ప్రగతిశీల మరియు తుది గనుల మూసివేతకు తీసుకున్న చర్యలు, గ్రీన్ ఎనర్జీ సోర్సింగ్, భూమి, అంతర్జాతీయ ప్రమాణాలను స్వీకరించడం, స్థానిక సమాజంతో నిమగ్నత, సంక్షేమ కార్యక్రమాలు, పునరావాసం, ఇతర సామాజిక ప్రభావాలు వంటి పారామితులపై ఉంటాయి. అసాధారణంగా బాగా, ఉత్తమంగా పనిచేసే గనులకు ఈ రేటింగ్ ఇవ్వబడుతుంది.