Monday, September 8, 2025

ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్.. అంపైర్లగా ఎవరంటే..

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తే మ్యాచుల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ (Ind VS Pak) మ్యాచ్ ఒకటి. ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి అంటే.. పనులన్ని మానుకొని టివిలకు అతుక్కుపోతారు ఫ్యాన్స్. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత్, పాకిస్థాన్‌లు ఆసియాకప్‌లో తలపడనున్నాయి. తొలుత ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్ల వినిపించినా.. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆడుతామని బిసిసిఐ ప్రకటించింది. అయితే భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో అంపైర్లుగా ఎవరు వ్యవహరిస్తారో అనే విషయాన్ని ఐసిసి తాజాగా వెల్లడించింది.

ఈ హై వోల్టేజీ మ్యాచ్‌కు (Ind VS Pak) ఫీల్డ్‌ అంపైర్లుగా రుచిర పల్లియగురుగె (శ్రీలంక), మసుదుర్‌ రెహ్మాన్‌ (బంగ్లాదేశ్‌) ఎంపిక చేయబడ్డారు. వీరిద్దరికి అంతర్జాతీయ అంపైర్లుగా అపార అనుభవం ఉంది. దీంతో ఈ మ్యాచ్‌కి వీరిద్దరిని ఎంపిక చేశారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాలకు చెందిన అభిమానులకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే రుచిర, రెహ్మాన్‌లను ఎంపిక చేశారు. రుచిరా 160కి పైగా మ్యాచులు, మసుదుర్‌ 70కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌కు టివి అంపైర్‌గా అహ్మద్ పక్తీన్ (అఫ్ఘానిస్థాన్), ఫోర్త్ అంపైర్‌గా ఇజతుల్లా సఫీ (అఫ్ఘానిస్థాన్) వ్యవహరించగా.. మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాప్ట్ (జింబాబ్వే) ఉంటారు.\

Also Read : ఆసియా కప్ హాకీ విజేత భారత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News