- Advertisement -
ఐరాస భద్రతామండలిలో పాకిస్తాన్ కు షాక్ తగిలింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఐరాస భద్రతామండలి తీవ్రంగా ఖండిస్తూ.. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడిపై పాకిస్థాన్ చెప్పిన పలు అంశాలను తిరస్కరించింది. పాక్‌కు కీలక ప్రశ్నలు సంధించిన భద్రతామండలి సభ్యదేశాలు.. లష్కరే తోయిబా ప్రమేయంపై ఆరా తీశాయి. ఈ సమస్యను భారత్‌తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సభ్య దేశాలు పాకిస్తాన్ కు సూచించాయి. అలాగే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ క్షిపణి ప్రయోగాలు నిర్వహించడం, అణ్వాయుధాలపై పాక్ నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సభ్యదేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
- Advertisement -