హెచ్‌ఐవి ఎయిడ్స్ నియంత్రణ కోసం అమెరికా అనేక దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఈ చర్యలతో వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సాయాన్ని ట్రంప్ యంత్రాంగం ఇటీవల నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌ఐవీ నిధులను పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు , మరో 60 లక్షల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం హెచ్చరించింది. గత ఆరు నెలలుగా అమెరికా నిధులు నిలిపివేయడంతో సరఫరా చైన్ అస్థిరంగా మారిపోయిందని, ఆరోగ్య కేంద్రాలు మూతపడి వేలాది క్లినిక్‌లు సిబ్బంది లేకుండా ఖాళీగా మిగిలిపోయాయని పేర్కొంది. భౌగోళిక , రాజకీయ పరిస్థితులు , వాతావరణ మార్పులు, ఈ ముప్పును మరింత పెంచేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
2029 నాటికి 40 లక్షల హెచ్‌ఐవి మరణాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -