Saturday, July 5, 2025

సచివాలయం ముట్టడికి నిరుద్యోగుల యత్నం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలండర్ విడుదల, మెగా డీఎస్సీ ప్రకటించాలని శుక్రవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ర్యాలీగా వస్తున్న పలువురు నిరుద్యోగులను అడ్డుకోని మరీ పోలీసు వాహనాల్లో స్థానిక స్టేషన్‌లకు తరలించారు. అలాగే డివైఎఫ్‌ఐ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి యత్నించారు.

ర్యాలీగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముట్టడికి యత్నించారు. అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డివైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.4వేలు ఇవ్వాలని, జాబ్ క్యాలండర్‌ను అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ముట్టడి నేపథ్యంలో ఉదయం నుంచే సచివాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News