Thursday, July 10, 2025

సేంద్రియ సాగు ప్రోత్సాహానికి కేంద్రం సహకారం: జెపి నడ్డా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై స్పందించింది. రాష్ట్ర అవసరాల మేరకు ఎరువులను సరఫరా చేయాలని.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా (JP Nadda) పేర్కొన్నారు. అలాగే యూరియాను సాగేతరాలకు మళ్లించకుండా చూడాలని.. అన్ని జిల్లాలకు యూరియా పంపిణి జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలో పెరిగిన యూరియా వినియోగంపై నడ్డా (JP Nadda) ఆందోళన వ్యక్తం చేశారు. 2024-25లో యాసంగిలో 21 శాతం యూరియా అమ్మకాలు పెరిగాయని అన్నారు. సేంద్రియా సాగు ప్రోత్సాహానికి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News