Saturday, September 13, 2025

హైదరాబాద్ మెట్రోలో ప్యాంట్ జిప్ తీసి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మెట్రోలో ఓ యువకుడు అసభ్యకరమైన పని చేసిన సంఘటన కలకలం రేపింది. రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఓ యువకుడు ఎక్కి, ప్యాంట్ జిప్ తీసి ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. పక్కనున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎప్పుడు, ఏ స్టేషన్ లో జరిగిందో తెలియాల్సి ఉంది, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పబ్లిక్ లో ఇలా చేయడం చాలా అవమానకరమని మండిపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు విదేశాలలో మాత్రమే జరిగేవని, ఇప్పుడు భారత్ లో జరగడం మన సంప్రదాయలకు ముప్పు వాటిళ్లుతుందున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News