Wednesday, July 16, 2025

ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -
- Advertisement -

ఆర్థిక వనరులతో ఫ్లైఓవర్ నిర్మాణంలో ఆలస్యం
తమ ప్రభుత్వ హయాంలో శిరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి…

మేడ్చల్ మల్కాజ్ గిరి/మేడిపల్లి: ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పేనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వం విఫ్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ జాతీయ రహదారిపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు.

తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గట్కారీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామని కోమటిరెడ్డి వివరించారు. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి పరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. నగరంలో పివి ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ గా పేరున్న ఉప్పల్ ఫ్లైఓవర్ అని స్పష్టం చేశారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలియజేశారు.

Uppal flyover delay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News