పెరగని జీతాలు, పర్మనెంటు కాని సర్వీసు, నెలల తరబడి జీతాలు అందక తమ పరిస్థితి దుర్భరంగా ఉందంటూ ఉర్దూ అకాడమీ కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోయారు. తమ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వెళ్లగక్కారు. తమ సేవలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని, కన్నీళ్లపర్వంతమయ్యారు. చాలీ చాలని జీతాలు కూడా ఐదారు నెలలకు ఒకసారి చెల్లిస్తున్నారని పేర్కొంటూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఇప్పటికీ నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉరూ ్ద అకాడమీలో నియమితులై రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించబడ్డ 138 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు దయనీయపరిస్థితుల్లో బతుకీడుతున్నారని మంత్రికి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 లో ఉర్దూ అకాడమీ నుండి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారని.
అప్పటి నుండి ఇప్పటివరకు తమకు కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, పర్మిట్ చేయకుండా అధికారులు నిర్లక్ష వైఖరిని అవలంభిస్తున్నారని వాపోయారు. తమను మాతృసంస్థ అయిన ఉర్దూ అకాడమీకి పంపించాలని చాలా కాలంగా పోరాడుతున్నా హామీలు తప్ప ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని వాపోయారు. ఉద్యోగుల సర్వీసును క్రమబద్దం చేయడంలోనూ అధికారులు పక్షపాత వైఖరినవలంభిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుండి కేవలం 16 మంది ఉద్యోగులను దొడ్డిదారిన పర్మనెంట్ చేశారని మిగితా వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మాకు జీతాలు పెంచడానికి బడ్జెట్ లేదని సాకుతో మదర్ డిపార్ట్మెంట్ కు రాకుండా అడ్డుపడుతున్నారని, మాతృసంస్థకు పంపించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి వేసిన కమిటీ ద్వారా కూడా ఆమోదం లభించిందని ఉద్యోగులు తెలిపారు. మాతృ సంస్థకు పంపించేందుకు మార్గం సుగమం అయిన సందర్భంగా తమ అనుయాయులైన 16 మందిని రెగ్యులర్ చేశారని, గతంలో కూడా అధికారుల తమకు సంబంధించిన వారు ఆరుగురిని పర్మినెంట్ చేశారని పేర్కొన్నారు.
అప్పడు 6, ఇప్పడు 16 మంది, మరి మా సంగతి ఏంటి సార్ అంటే ఏమి సమాధానం లేదని ఉద్యోగులు వాపోయారు. గతంలో ఆరుగురిని పర్మినెంట్ చేసిన అధికారులు సీనియారిటీని పట్టించుకోకుండా ఇప్పుడు 16 మందిని పర్మినెంట్ చేశారని ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జోక్యం తీసుకొని 35 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 138 మంది ఉద్యోగులను వెంటనే మాతృసంస్థకు పంపించి, కనీస వేతనాలు అమలు చేయాలని, తమ సర్వీసును క్రమబద్దం చేయాలని కోరారు.