Saturday, September 13, 2025

యూరియా వస్తోంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రానికి మరో నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కమిషనరేట్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సిఎల్) తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రా ష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. బుధవారం ఒక్కరోజే పలురకాల కంపెనీల నుంచి 11, 930 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి

చేరుకుందన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రానికి 23000 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చిందని, శనివారం వరకు సిఐఎల్, ఐపిఎల్, ఆర్‌సిఎఫ్, జిఎస్‌ఎఫ్‌సి, ఎస్‌పిఐసి కంపెనీల ద్వారా మరో 5,680 మెట్రిక్ టన్నులు రానున్నాయని మంత్రి వెల్లడించారు. దీంతో పాటు రాబోయే నాలుగు రోజుల్లో ఐఎఫ్‌ఎఫ్‌సివో, ఎంసిఎఫ్‌ఎల్, సిఐఎల్ కాకినాడ, ఎస్‌పిఐసి, క్రిబ్కోలతో పాటు కంపెనీల నుంచి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానున్నదని మంత్రి వివరించారు. ప్రస్తు తం రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుంచి 11 రేకులు రవాణాలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎరువులు మిర్యాలగూడ, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, తిమ్మాపూర్, వరంగల్, సనత్ నగర్ రైల్వే రేక్ పాయింట్లకు చేరుకుంటాయని, క్రమంగా జిల్లాలకు చేరుతాయని తెలిపారు. దీంతో పాటు 12 నుంచి 18వ తేదీ వరకు మరో 11 రేకులు రాకకు ప్రణాళిక సిద్దం చేశామని మంత్రి వెల్లడించారు. రైతులకు ఎరువుల పంపిణీ అంతరాయం లేకుండా ఉండేందుకు రైతు వేదికలలో సేల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎరువులు రాగానే వాటిని వెంటనే రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News