Tuesday, August 26, 2025

యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోంది: జూపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూరియా కోసం రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యూరియా పంపిణీపై రేపు అన్ని జిల్లాల్లో సమీక్షిస్తామని అన్నారు. జూపల్లి మీడియాతో మాట్లాడుతూ..ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వం పంపిన యూరియానే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని, నానో యూరియా వాడాలని కేంద్రం చెప్తోందని తెలియజేశారు. నానో యూరియా వాడకంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగలేదని, యూరియా కొరత ఉందని కేంద్రప్రభుత్వమే చెప్తోందని అన్నారు. అంతర్జాతీయ యుద్ధాల వల్ల దిగుమతి సమస్య ఉందని కేంద్రం చెప్తోందని, యూరియా కేటాయింపులో కేంద్రం సహకరించటం లేదని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

Read Also: యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే.. సిఎం, మంత్రులు ఎక్కడ?: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News