హైదరాబాద్: ప్రతి నెలలో సరఫరా చేయాల్సిన యూరియాలో కేంద్ర ప్రభుత్వం కోతపెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సెప్టెంబర్‌లో రావాల్సిన 1.6 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయలేదని మండిపడ్డారు. బుధవారం తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఇతర దేశాల నుంచి వస్తోన్న యూరియానే సరఫరా చేస్తున్నారని తుమ్మల తెలియజేశారు. దేశంలో యూరియాను సరైన సమయంలో ఉత్పత్తి చేయలేదని, దేశ వ్యాప్తంగా ఉన్న యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తోందని, తెలంగాణను ఇప్పటివరకు 9.8 లక్షల టన్నుల్లో 5.3 లక్షల టన్నులే సరఫరా చేశారని దుయ్యబట్టారు. ఇతర దేశాల నుంచి యూరియాను ఎందుకు దిగుమతి చేసుకోవడంలేదని తుమ్మల ప్రశ్నించారు.
Also Read: వినాశకాలే ట్రంప్ విపరీత బుద్ధి!
అన్ని పంటలకు సెప్టెంబర్ చివరి కోటా యూరియా వేయాలన్నారు. ఇటీవల భారీ వర్షాలతో ఆరేడు జిల్లాల్లో అన్ని శాఖల్లో తీవ్ర నష్టం జరిగిందని, తెలంగాణలో పంటలు, రోడ్లు, మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయని, చేనేత రంగంపై పన్నులు ఉండకూడదని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని, వ్యవసాయ పనిముట్లపై జిఎస్‌టి రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ దిగుమతులపై సుంకాలు 40 శాతానికి పెంచాలని, బిఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం తమకు సంబంధం లేదన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు ఇచ్చామని, ఏది ఉన్నా వాళ్లే చూసుకుంటారని వివరించారు.