- Advertisement -
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పెబ్బేరు మండల పరిధిలోని రంగాపురం స్టేజి సమీపమున గురువారం లారీ యూరియా వేసుకొని గద్వాల నుండి కొత్తకోట వెళ్తుండగా అదే రూట్లో వస్తున్న కారు అతివేగంగా వచ్చి లారీ కుడివైపు ముందు టైర్లను ఢీకొనడంతో లారీ అదుపుతప్పి డివెండర్‌ను ఢీకొట్టింది. దీనివల్ల లారీ బోల్తా పడి లారీలో ఉన్న డ్రైవర్ తమ్ముడైన ఎండి మహబూబ్ తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు. కార్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.
- Advertisement -