Monday, July 28, 2025

లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బెటర్

- Advertisement -
- Advertisement -

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి తుమ్మల చురక
కేటాయింపులు, సరఫరా గణాంకాలతో లేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రానికి యూరియా సరఫరా కొరతపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు వ్యవసాయరంగంపై కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా కేటాయింపులు, సరఫరా అంశాలపై అవగాహన లేకుండా, రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా మట్లాడడం సరికాదని – మంత్రి తుమ్మల హితవు పలికారు.

ఆదివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు యూరియా సరఫరాకు సంబంధించి పూర్తి లెక్కలతో మంత్రి తుమ్మల లేఖ రాశారు. యూరియాపై బిజెపివి అర్ధంలేని మాటలని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయరంగంపై కనీసం అవగాహన లేకుండా, ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నిజనిజాలు బేరీజు వేసుకోకుండా మాట్లాడడం సరికాదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని చెప్పడం వారికి, వారి పార్టీకి రాష్ట్ర రైతాంగం పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు.

రైతాంగం విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎకన్నోసార్లు వ్యవసాయ మంత్రిగా తాను విన్నవించినప్పటికీ కేంద్రం వైఖరి మారడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి రాష్ట్రానికి కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్ మొత్తానికి కేవలం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేటాయించిందని, ఇది కూడా తెలియకుండా 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం ఇకపై మానుకోవాలకని మంత్రి తుమ్మల సూచించారు. ఇప్పటికే పలు సందర్భాల్లో గణాంకాలతో సహా కేంద్ర రసాయన మంత్రికి, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్‌లకు లేఖలు రాయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News