ప్రతిష్టాత్మక వింబుల్డన్ మ్యాచ్‌లు ఈ మధ్యే ముగిసిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు కోకొల్లలుగా వెళ్లారు. ఎంతో మంది సెలబ్రిటీలు కూడా అభిమానులతో కలిసి మైదానంలో ఈ టెన్నీస్ మ్యాచులు వీక్షించారు. అలా వింబుల్డన్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన వాళ్లలో ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) కూడా ఉంది. లండన్‌లో జరిగిన వింబుల్డన్ మ్యాచులు చూసేందుకు వెళ్లిన ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది.
లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయంలో తన ఖరీదైన అభరణాలు ఉన్న సూట్‌కేస్‌ను ఊర్వశి (Urvashi Rautela) పొగొట్టుకుంది. దాదాపు 70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్న సూట్‌కేసు చోరీకి గురైనట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయ అధికారులు తనకు ఎలాంటి సహాయం చేయలేదని ఆమె పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. విమానాశ్రయంలో భద్రత లోపాన్ని ప్రస్తావించింది. ప్లాటినం ఎమిరేట్స్ సభ్యురాలిగా ఎయిర్‌పోర్టులో తన వింబుల్డన్‌కు గ్లోబల్ ఆర్టిస్ట్‌గా హాజరయ్యానని.. ముంబై నుంచి గాట్విక్ చేరుకోగా ఎయిర్‌పోర్టులో తన బ్యాగ్ దొంగిలించారని వెల్లడించింది. బ్యాగ్‌తో పాటు టికెట్ వివరాలను పంచుకుంది. తన బ్యాగ్ తనకు త్వరగా తిరిగి వచ్చేలా సహాయం చేయాలని స్థానిక పోలీసులను విజ్ఞప్తి చేసింది.