బాలీవుడ్‌లో చేసిన సినిమాలు తక్కువే అయిన ఆర్భాటంలో మాత్రం ఎప్పుడు ముందు ఉంటది నటి ఊర్వశీ రౌటెలా. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ.. తన విశేషాలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటుంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన నేపథ్యంలో తన వేలుకు ఉన్న డైమండ్ రింగ్‌ని చూపిస్తూ మాట్లాడింది. దీంతో ఆమెపై విమర్శల వర్షం కురిసింది. దీంతో ఆమె క్షమాపణ చెప్పింది.
అయితే ఇప్పుడు మరోసారి ఊర్వశీ ఓ విషయాన్ని బయటపెట్టింది. ఉత్తరాఖండ్‌లో ఊర్వశీ కోసం గుడి కట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఆలయం తనదేనని ఊర్వశీ తెలిపింది. ఇది బద్రినాథ్ ఆలయం సమీపంలో ఉందని పేర్కొంది. దీని గురించి ఊర్వశీ మాట్లాడుతూ.. ‘ఊర్వశీ దేవాలయానికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సటీలో నన్ను భక్తిగా పూజిస్తారు. ఆ గుడిలో నన్ను దండమామై అని పిలుస్తుంటారు. పనిలో పని దక్షిణ భారతంలో కూడా నాకో గుడి నిర్మిస్తే బాగుంటుంది’ అని ఊర్వశీ పేర్కొంది. దీనిపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తూ కామెంట్ చేస్తున్నారు.