Monday, September 8, 2025

వెనిజులా నౌకపై అమెరికా దాడి: 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: దక్షిణ కరేబియన్‌లో వెనిజులా నౌకపై అమెరికా దాడి చేయడంతో 11 మంది మృతి చెందారు.  వెనిజులా నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో 11 మంది మృతి చెందడంపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. ఈ దాడి తమ సైన్యం ఉత్తమ చర్య అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించుకున్నారు. అంతర్జాతీయ న్యాయ నిపుణులు అమెరికా చర్యను తప్పుబడుతున్నారు. తాజాగా ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. ఈ దాడి ఘటనను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఖండించారు.

Also Read: పాత నగరంలో కొత్త చరిత్ర

వెనిజులా పడవపై జరిగిన దాడి తరువాత రెండు వెనిజులా సైనిక విమానాలు గురువారం అంతర్జాతీయ జలాలలో ఉన్న అమెరికా నౌకకు సమీపంగా విహరించాయని పెంటగాన్ పేర్కొంది. ఇది వెనిజులా నుంచి వచ్చిన డ్రగ్ రవాణా పడవపై తాము దాడి చేశామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. వెనిజులాకు అధ్యక్షుడు నికోలస్ మదురోను ఒక డ్రగ్ కార్టెల్‌కి నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపణలు చేసింది. వెనిజులాను నడిపిస్తున్న కార్టెల్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. నార్కొటిక్స్, టెర్రర్ ఆపరేషన్ల వ్యతిరేకంగా అమెరికా సైనిక దళాలు పని చేస్తున్నాయని, అమెరికా సైనిక దళాలకు ఆటంకం కలిగిస్తే కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పెంటగాన్ హెచ్చరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News