పెగులా, అజరెంకా ముందుకు, మెద్వెదేవ్‌కు షాక్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ
న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో (US Open Grand Slam tournament) సెర్బియా యోధుడు, ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. అయితే 13వ సీడ్ డానియల్ మెద్వెదేవ్ (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా), మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అంతేగాక 16వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్), ఏడో సీడ్ జస్మయిన్ పౌలిని (ఇటలీ) తదితరులు కూడా తొలి రౌండ్లో విజయం సాధించి ముందంజ వేశారు. పెగులా మొదటి రౌండ్లో 60, 64తో మేయర్ షెరిఫ్ (ఈజిప్ట్)ను ఓడించింది. తొలి సెట్లో పెగులా చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా గెలిచి అవకాశం ఇవ్వకుండా సెట్‌ను దక్కించుకుంది.
Also Read: ఫామ్‌హౌస్‌లో మానవ మృగాలు
రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను (US Open Grand Slam tournament) సొంతం చేసుకుంది. వెటరన్ క్రీడాకారిణి అజరెంకా తొలి రౌండ్లో చెమటోడ్చి నెగ్గింది. అమెరికా క్రీడాకారిణి హీనా ఇనొయితో జరిగిన పోరులో అజరెంకా 76, 64తో విజయం సాధించింది. హీనా అసాధారణ ఆటతో అజరెంకాను ముప్పుతిప్పలు పెట్టింది. ఇక పౌలిని తొలి రౌండ్లో 62, 76తో ఆస్ట్రేలియాకు చెందిన డెస్టాని ఐవాను ఓడించింది. తొలి సెట్లో పౌలినికి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. కానీ రెండో సెట్లో డెస్టాని అద్భుత పోరాట పటిమను కనబరిచింది. కానీ టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్లో పౌలిని విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. బెన్సిక్ 63, 63తో చైనాకు చెందిన జాంగ్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బెన్సిక్ వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. అన్నా బిన్కొవా తొలి రౌండ్లో 63, 61తో యులియా (ఉక్రెయిన్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.
నొవాక్ ముందుకు..
పురుషుల సింగిల్స్‌లో మాజీ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. అమెరికా ఆటగాడు లర్నర్ టీన్‌తో జరిగిన పోరులో నొవాక్ 61, 76, 62తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే నొవాక్ దూకుడుగా ఆడాడు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ రెండో సెట్లో నొవాక్‌కు ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్‌లో జకోవిచ్ సెట్‌ను సొంత ంచేసుకున్నాడు. మూడో సెట్లో నొవాక్‌కు ఎదురే లేకుండా పోయింది. చివరి వరకు దూకుడుగా ఆడిన నొవాక్ అలవోక విజయంతో ముందంజ వేశాడు. మరోవైపు రష్యా స్టార్ ఆటగాడు మెద్వెదేవ్ తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెంజిమన్ బొంజితో జరిగిన ఐదు సెట్ల హోరాహోరీ సమరంలో(US Open Grand Slam tournament) పోరాడి ఓడాడు.
US Open Grand Slam tournament