న్యూఢిల్లీ : అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ విధానాలతో భారతీయుల అమెరికా కలలు కల్లలలయ్యేలా కన్పిస్తున్నాయి. జూలై 4న ట్రంప్ సంతకం చేసిన తన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కింద చాలామంది నాన్- ఇమిగ్రెంట్ వీసా వర్గాలపై పెనుభారం మోపుతూ, 250 అమెరికా డాలర్ల మేరకు కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజు ను ప్రవేశ పె ట్టారు. టూరిజం కోసమో, చదువు లేదా అమెరికాలో పని చేసేందుకో వెళ్లే భారతీయ దరఖాస్తుదారులు 2026 నుంచీ వీసాలకోసం భారీ మొ త్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో రూ15 వేల కంటే తక్కువ ఖర్చయ్యే సాధారణ పర్యాటక వీసాకోసం ఇక రూ 40 వేలవరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అమెరికా వీసా ఇం టిగ్రిటీ ఫీజు అనేది ప్రస్తుత వీసా ఖర్చులకు అదనంగా జోడించిన సర్ చార్జి సుమారు 250 డా లర్లు అంటే భారతీయ కరెన్సీలో 21,400 రూ పాయలు.
ఇది తిరిగి వాపస్ చేయని మొత్తం. వీసా జారీ సమయంలో దీనిని తప్పనిసరిగా చె ల్లించాలి. ఇది 2026 సంవత్సరం నుంచి అ మలు లోకి వస్తుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ రుసుమును ఏటా సర్దుబాటు చేస్తారు. అంటే అదనపు వడ్డింపు తప్పకపోవచ్చు. వలసదారులు కానివారికి ఈ రుసుము ప్రధానంగా వర్తిస్తుంది. వీటిలో బి-1, బి-2 పర్యాటక,వ్యాపార వీసాలు, ఎఫ్, ఎం- విద్యార్థి వీసాలు, హెచ్-1బి పనిచేసే ఉ ద్యోగులవీసాలు, జె అంటే ఎక్సేంజ్ సందర్శకు ల వీసాలు ఉన్నాయి. ఏ, జి వర్గాల లోని దౌత్య పరమైన వీసా హోల్డర్లకు మాత్రమేఈ రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం అ మెరికా బి-1, బి-2 వీసాల ధర 185 డాలర్లు, అం టే రూ.15,800 కంటే ఎక్కువ.ఇప్పుడు వీసా ఇంటిగ్రిటీ ఫీజు ఐ-94 కు 24 డాలర్లు, ఇఎస్టిఏ ఫీజు 13 డాలర్ల వంటి చిన్నచిన్న ఫీజులు కలిపితే, 472 డాలర్ల మేరకు పెరుగుతుంది. అంటే రూ.40,502 కు పెరుగుతుంది. ఇది ప్రస్తుత వీసాధర కంటే రెండున్నర రెట్లు ఎక్కువ. అంతే కాదు ఎఫ్, లేదా హెచ్ -1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు, ఉద్యోగులకు, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.
వీసా ఫీజు తిరిగి వాపస్ చేస్తారా?
వీసా రుసుము మాఫీ చేయడం కానీ, తగ్గించడం కానీ సాధ్యం కాదు. కొన్ని షరతుల ప్రకారం దానిని తిరిగి చెల్లించే అవకాశం లీలగా ఉంది. వీసా కలిగిన వ్యక్తి వీసా గడువు ముగిసిన ఐదు రోజులలోపు అమెరికా నుంచి బయలుదేరడం, లేదా చట్టబద్ధంగా వారు అమెరికాలో ఉంటే బసను పొడిగించుకోవడం, వంటి అన్ని వీసా నిబంధనలను పాటిస్తే ఫీజు వాపస్ పొందేందుకు అర్హులు. ఎవరైనా వీసా నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం పీజు వాపస్ వర్తించదు. అంటే గోడకు కొట్టిన సున్నమే.
ఈ ఫీజు వడ్డంపు ఎందుకంటే..
అమెరికా ప్రభుత్వం తమ దేశాన్ని సందర్శించే విదేశీయులలో చట్టబద్ధమైన ప్రవర్తనను ప్రోత్సహించేందుకు భద్రతా చర్యగా అదనపు ఫీజు వడ్డింపును ప్రవేశపెట్టింది. ఇది భద్రతా డిపాజిట్ గా పనిచేస్తుంది. సందర్శకులు వీసా నియమాలు కచ్చితంగా పాటించేలా ఇది ప్రోత్సహింస్తుందని భావిస్తున్నారు. ఈ విధానాన్ని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హ్యోమ్ ల్యాండ్ సెక్యురిటీ (డిహెచ్ ఎస్) నిర్వహిస్తుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రతి సంవత్సరం సవరించే అధికారం ఆ శాఖకు ఉంటుంది. వీసా ఇంటిగ్రిటీ ఫీజు తోపాటు, ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో అమెరికాలోని వారు తమదేశంలోని వారికి పంపే రెమిటన్స్ లపై 1 శాతం ఎక్సైజ్ టాక్స్ కూడా ఉంది. అమెరికాలో ఉన్న, లేదా పనిచేస్తున్న విదేశీ పౌరుల నుంచి ఆదాయం పెంచడానికి ట్రంప్ సర్కార్ తీసుకున్న మరో చర్య ఇది.