Wednesday, April 30, 2025

చదువుకు వస్తే గెటౌట్ అంటావా ట్రంప్:భారతీయ విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

వీసా రద్దు, దేశం నుంచి వెళ్లిపోవాలనే హెచ్చరికలపై భారతీయ విద్యార్థిని ఒక్కరు ట్రంప్‌పై కేసు వేశారు. వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల కోత, వారిని స్వదేశాలకు పంపించడం జరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసకుంది. భారత్‌కు చెందిన చిన్మయ్ డియోరె అమెరికాలోని వాయ్నే విశ్వవిద్యాలయ విద్యార్థిని. తాను అమెరికాకు చదువుకోవడానికి వచ్చానని, నేరం చేయడానికి కాదని, తనను ట్రంప్ ఏ అధికారంతో తిప్పి పంపిస్తారని ఈ చిన్మయ్ ప్రశ్నించారు. తమకు అమెరికాలో చట్టపరంగా ఉండే అవకాశాలు కల్పించాలని ఇప్పటికే పలువురు విద్యార్థులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తమ చదువులకు గండి కొడితే తమ భవిత ఏమవుతుందని వీరు వేస్తున్న పిటిషన్లు ఇప్పుడు తీవ్రస్థాయి చర్చనీయాంశాలు అయ్యాయి. తమపై నేరపూరిత చర్యలు పైగా మరీ చిల్లర దొంగతనాలు, ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి కేసులను పెట్టి తిప్పి పంపే వ్యవహారం సాగుతోందని భారతీయ విద్యార్థులు మండిపడుతున్నారు.

ట్రంప్ ఏకపక్ష చర్యలను తాము చట్టపరంగా కోర్టులోనే ఎదుర్కొంటామని, తమకు న్యాయం జరుగుతుందని చిన్మయ తెలిపారు. ఒకే వర్శిటీలో విద్యార్థులు ముగ్గురు ట్రంప్‌పై కేసు పెట్టారు, వీరిలో చైనాకు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. ట్రంప్‌తో పాటు హోంల్యాండ్ సెక్రెటరీ, ఇమిగ్రేషన్ అధికారులను కేసులో ప్రతివాదులగా చేర్చారు. తమకు ఎటువంటి వివరణకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని, తమ స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్థాయిని ట్రంప్ ఒక్క వేటుతో రద్దు చేసి పారేశారని, ఇది అన్యాయం అని ఓ ప్రభుత్వాధినేత వైఖరి వల్ల విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోవాల్సిందేనా? అని పిటిషన్లలో ప్రశ్నించారు. స్టూడెంట్ స్టేటస్, విద్యార్థుల వినిమయ సంబంధిత సెవిస్ వ్యవస్థను ట్రంప్ ఏ విధంగా బేఖాతరు చేస్తారని భారతీయ విద్యార్థిని తమ పిటిషన్‌లో సమగ్ర రీతిలో నిలదీశారు. విచారణ తరువాత పరిణామాలను పక్కకు పెడితే ఇప్పటికే ఈ అమ్మాయి పిటిషన్ మీడియా పరంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలకు దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News