హైదరాబాద్: భూభారతి పేద రైతులకు చుట్టమని సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై ఈ సమీక్షలో చర్చించారు.
ఇందిరమ్మ ఇళ్లకు మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని సిఎం (CM Revanth Reddy) అన్నారు. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని పేర్కొన్నారు. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలని తెలిపారు. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలని సూచించారు. 29, 30 తేదీల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు.