Tuesday, September 2, 2025

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా…

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, -హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. త్రీ పీస్ సూట్, టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కళ్యాణ్ చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో పేరుగాంచిన హరీష్ శంకర్..

పవన్ కళ్యాణ్ కోసం తనలోని అభిమానిని బయటకు తీసుకువచ్చి, ’ఉస్తాద్ భగత్ సింగ్’లోని ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు విందును ఇచ్చారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు. రాబోయే షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుంది. ’ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News