- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, (Power Star Pawan Kalyan) డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. మంగళవారం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో చేరారు. పవన్ ఎంట్రీతో సెట్స్‌లో జోష్ నెలకొంది. పవన్ కళ్యాణ్‌తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక (Srileela heroine) గా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్-, లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు.
- Advertisement -