డిప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ షూటింగ్ కొంతభాగం జరిగిన తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ను నిర్మాతలు ఆపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ మూవీ గురించి అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో పవన్ కు సంబంధించిన చిత్రీకరణను కంప్లీట్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ మూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘ఓజి’ మూవీ చిత్రీకరణ కూడా ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిప్యూటీ సిఎం అయిన తర్వాత ఇన్నిరోజులకు సమయం దొరకడంతో పవన్ ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక, జూన్ 12 ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.