Friday, July 25, 2025

యథార్థ ఘటనలతో లవ్‌స్టోరీ

- Advertisement -
- Advertisement -

యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా ‘ఉసురే’ (Ussure) ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ డి.గోపాల్ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్. సీనియర్ హీరోయిన్ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ డి.గోపాల్ మాట్లాడుతూ “ఈ సినిమాను చిత్తూరులోని ఓ గ్రామంలో చిత్రీకరించాం. ఓ అచ్చ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది.

ఎంతో సహజంగా చిత్రీకరణ చేశాం”అని అన్నారు. నిర్మాత మౌళి ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ “ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే లవ్‌స్టోరీ (touching love story) ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రను రాశి చేశారు. పవర్‌ఫుల్ పాత్ర ఆమెది. ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్, విజయ్‌సేతుపతి, శృతిహాసన్ అందరూ సపోర్ట్ చేశారు. కొత్త టీమ్‌తో రూపొందిన ఈ సినిమా అందరికి నచ్చుతుంది”అని తెలిపారు. సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ “ఈ చిత్రంలో నా పాత్ర ఎలా ఉంటుందో ట్రైలర్ చూశారు. ఈ చిత్రంలో నేను హీరోని కొట్టాను.. హీరోయిన్‌ని కొట్టాను.. ప్రేయసిరావే చిత్రంలో హీరో శ్రీకాంత్‌ని కొట్టాను.. ఆ సినిమా హిట్ అయ్యింది. నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఉసిరే కూడా హిట్.. ఎందుకంటే నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్. యదార్థ సంఘటనలతో ఈ సినిమా రూపొందింది”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ జనని, హీరో టీజయ్ అరుణసలం, సంగీత దర్శకుడు కిరణ్ జోజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News